నిట్ ప్రక్షాళనకు కమిటీ: చైర్మన్ దీక్షితులు

ప్రత్యేక నిధులు మంజూరు చేయించి క్యాంపస్‌లోని సమస్యలను యుద్ధప్రాతిపదకన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్‌కోర్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించడం వల్ల విద్యార్థులు క్యాంపస్ బయట భోజనం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడడం, మినరల్ వాటర్‌ప్లాంట్ మరమ్మతుకు రావడం లాంటివి సమస్యను మరింత జఠిలం చేశాయని అన్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ త్వరలోనే తొలగిస్తామన్నారు. డైరెక్టర్ వై.వి.రావుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ కమిటీ వేయనున్నట్లు తెలిపారు. చర్యలు తీసుకునే అధికారం ఎంహెచ్‌ఆర్‌డీకే ఉంటుందని స్పష్టం చేశారు.
నిట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ రానుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్లు పివి నరేందర్ రెడ్డి, ఆర్.వి.చలం, సంజీవి, ఏఐఎం రెడ్డి పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ వైవి రావును తొలగించి, మరొకరిని నియమించే అధికారం ఎంహెచ్ ఆర్ డీకే ఉంటుందని దీక్షితులు స్పష్టం చేశారు. నిట్‌లోని ఆయా విభాగాల అధిపతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విచారణ కమిటీ తుది నివేదిక వచ్చే వరకూ వైవి రావు సెలవులోనే ఉంటారని చెప్పారు. నిట్‌కు సంబంధించి 40 ఫిర్యాదులు అందాయని, వీటిపై కమిటీ సమగ్రమైన విచారణ చేపడుతుందని అన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ సిఎస్‌పి రావు, పీఆర్ ఓ రవీందర్ రెడ్డి, కామేశ్వర్‌రావు, శర్మ, చీఫ్ వార్డెన్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిట్‌లోని సమస్యల తీవ్రతను దీక్షితులకు విద్యార్థి కౌన్సిల్ నేతలు అంకిత్‌రెడ్డి, పృథ్వీ, జైన్‌సిన్హా వివరించారు.












Click it and Unblock the Notifications