అరకులోయలో మళ్ళీ ఆంత్రాక్స్ భయం

గుంటసీమలో కూడ పెదర దేవన్న అనే గిరిజనుడు, జామిగుడలో మరో మహిళ కూడా ఇదే లక్షణాలతో బాధపడుతున్నారు. అప్పలరాజు నాలుగు రోజుల క్రితం డుంబ్రిగుడ మండలం గుంటసీమలోని బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉన్నాడు. ఎడమ చేతిపై చిన్న కురుపుగా వచ్చి చేయంతా వ్యాపించిందని బాధితుడు విలేకరులకు తెలిపాడు. తాను పశుమాంసం తినలేదని బంధువుల ఇంటిలో కోడిమాంసం మాత్రం తిన్నట్టు తెలిపాడు. 2004లో మండలంలోని పెదలబుడులో ఆంత్రాక్స్ ప్రబలి ఓ గిరిజనుడు మృతి చెందగా,సుమారు 28 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అప్పట్లో అధికారుల చర్యలతో పశు, మేక మాంసాలు విక్రయం సుమారు మూడు నెలలు పాటు నిషేధించారు. పశువులకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేశారు. అప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ వ్యాధి మళ్లీ సంక్రమించడంతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది మరింతమందికి సోకకముందే అధికారులు తగు నివారణ చర్యలు చేపట్టి ఆయా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications