మాస్కోలో పేలుళ్లు: 41 మంది మృతి

మృతులంతా ప్రయాణికులేనని తెలుస్తోంది. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. లూబియాంకా మెట్రో స్టేషన్ లో రైలులోని వ్యాగన్ లో పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాగన్ లో 14 మంది, ప్లాట్ ఫారం మీద 12 మంది మరణించినట్లు చెబుతున్నారు. వివరాలు అందాల్సి ఉంది.
పార్క్ కుల్తిర్తీ మెట్రో స్టేషన్ లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది మరణించారు. పేలుళ్లకు కారణమేమిటో వెంటనే తెలియతడం లేదు. అయితే ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications