రోశయ్యతో మాట్లాడని వైయస్ జగన్

YS Jagan
విజయవాడ: ఒకే చోట ఉన్నా, ఒకే వేదికను పంచుకోవాల్సిన వచ్చినా వారిద్దరూ మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఒకరి ముఖం మరొకరు చూసుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సంస్మరణ సభలో పాల్గొనేందుకు వీరిద్దరూ వచ్చారు. గూడవల్లిలో జరిగిన కోనేరు సంస్మరణ సభలో పాల్గొన్న వైయస్ జగన్ ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేలోగానే తన ప్రసంగం ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ లాంజ్ లో ఆయన అభిమానులతో, మిత్రులతో మాట్లాడుతూ ఉండిపోయారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కోనేరు రంగారావు సంస్మరణ సభలో పాల్గొనడానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

రోశయ్య, వైయస్ జగన్ ఇద్దరు కూడా 20 నిమిషాల పాటు గన్నవరం విమానాశ్రయంలో ఉన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిని పలకరించే ప్రయత్నం చేయలేదు. మంత్రులు పార్థసారథి, రామచంద్రారెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ వైయస్ జగన్ తోనే ఉండిపోయారు. ముఖ్యమంత్రి రోశయ్య అక్కడి నుంచి గూడవల్లికి బయలుదేరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వైయస్ జగన్ విమానంలో బెంగళూర్ బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+