కొత్త లడ్డూ కౌంటర్లతో కొత్త ఇబ్బందులు

Tirumala
తిరుమల: దళారులతో పనిలేకుండా భక్తులే నేరుగా అదనపు లడ్డూలు పొందే విధంగా ఏర్పాటు చేసిన కొత్త లడ్డూ పథకంలో శాస్త్రీయత లోపించింది. దీనిపై మిశ్రమ స్పందన కన్పిస్తోంది. లోపల రెండు, బయట నాలుగు లడ్డూలు పొందే అవకాశమున్నా ఇందులో అనేక లోపాలు కన్పిస్తున్నాయి. లడ్డూలు పొందిన భక్తులు, దళారులు తిరిగి లడ్డూలు పొందుతున్నారు. అడుగడుగునా కనిపిస్తున్న లోపాల వల్ల కొత్త పథకం దళారులకు వరంగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది.

ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కొత్త లడ్డూ పథకంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా దళారులకు చేతినిండా పనిదొరికింది. ధర్మదర్శనానికి వెళ్లే సామాన్య భక్తులకు రూ.10 చొప్పున రెండేసి లడ్డూలు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం 4 లడ్డూలు మంజూరు చేసే విధంగా టీటీడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. లడ్డూలు పొందేందుకు ఆలయం వెలుపల భక్తులు గంటల సమయం వెచ్చించాల్సి వస్తోంది. సుమారు రెండు గంటలకుపైగా నిరీక్షించి లడ్డూ పడి టికెట్టు పొందుతున్నారు. తిరిగి ఆ టోకెన్లపై లడ్డూలు పొందేందుకు మరోసారి కూడా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఎలాంటి వేలి ముద్ర, ఫొటో తీసే అవకాశం లేకపోవడం వల్ల లడ్డూలు పొందిన వ్యక్తులే తిరిగి పొందుతుండడం గమనార్హం.

ఆలయం వెలుపల నేరుగా రూ.100 చెల్లించి 4 లడ్డూలు పొందేలా కొత్త సౌకర్యం కలగడంతో దళారులకు వరంగా మారింది. భక్తుల ముసుగులో దళారులు క్యూలైన్లలో నిలబడి అదనపు లడ్డూలు పొందుతున్నారు. మరోవైపు టికెట్లు మంజూరు చేసే కౌంటర్‌ వద్ద భద్రతా, ఇతర సిబ్బంది సిఫారసులు పెరిగిపోయాయి. తమవారికైతే క్యూతో సంబంధం లేకుండానే లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తుండడం గమనార్హం. ఈ విషయంలో అన్ని వర్గాలూ ముందు వరుసలోనే ఉన్నారు. కొంతమంది సిబ్బందిని మచ్చిక చేసుకున్న దళారులు గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని కానిచ్చేస్తున్నారు. భక్తుల అవసరం తగ్గట్టుగా సొమ్ము చేసుకుంటున్నారు.

ధర్మదర్శనానికి వెళ్లే భక్తులకు మంజూరు చేస్తున్న లడ్డూ కౌంటర్లలోనే రూ.25 చొప్పున అదనపు లడ్డూలు మంజూరు చేస్తేనే సౌకర్యంగా ఉంటుందని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే నిజమైన భక్తులకే సమయం వృథా కాకుండా అదనపు లడ్డూలు పొందే అవకాశం కలుగుతుంది. పటిష్ట భద్రతా చర్యల మధ్య ఇక్కడే టోకెన్లు మంజూ రు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్వత్రా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+