పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉంది: సబిత

హైదరాబాదులో చాలా రోజుల తర్వాత ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడానికి సహకరించాలని ఆయన కోరారు. తాను ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుంటానని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. అయినా సభ సద్దుమణగలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications