న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ లో గల ఇన్లాండ్ కంటైనర్ డిపోలో శనివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు డిపోలో మంటలు లేవడం ప్రారంభించాయి. అవి వస్త్రాలు, టైర్లు నిల్వ ఉంచి 30 కంటైనర్లకు వ్యాపించాయి.
సంఘటనా స్థలానికి 22 ఫైర్ టెండర్లు చేరుకున్నాయి. మూడు గంటలకు ఉదయం 9 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. జైపూర్, అహ్మదాబాదుల్లో కూడా అగ్నిప్రమాదాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.