మెదక్: తెలంగాణ కోసం మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేటలో రాం రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక లేఖ రాసి పెట్టి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను ఆ లేఖలో రాశాడు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో ఆత్మహత్యల పరంపర ఆగింది. మళ్లీ ఇప్పుడు రాంరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలవర పరుస్తోంది.