ముగ్గురు టిడిపి ఎంపీలకు స్పీకర్ షాక్

లోకసభకు ఎన్నికైన తర్వాత 90 రోజులలోగా సభ్యులు తమ తమ ఆదాయ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గడువులోగా అందించకపోవడంతో ఆ గడువును ఆరు నెలలకు పెంచారు. అయినా కొంత మంది అందించలేదు. దీంతో ముగ్గురు తెలుగుదేశం సభ్యులతో పాటు ఇతర పార్టీలకు చెందిన సభ్యులకు కూడా మీరా కుమార్ నోటీసులు జారీ చేశారు. ఆదాయ వివరాలు అందించకపోతే సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications