థరూర్ గొడవపై ప్రణబ్ ప్యానెల్ విచారణ

కోచి జట్టు భాగస్వాములను వెల్లడించకూడదని థరూర్ మోడీని కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో థరూర్ కు, లలిత్ మోడీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వారిద్దరు తమ తమ మాటలకే కట్టుబడి ఉన్నారు. ఎవరు కూడా మెట్టు దిగడం లేదు. రాండివూ స్పోర్ట్స్ నిజమైన యజమానలెవరనేది వెల్లడించకూడదని థరూర్ తనను కోరినట్లు మోడీ ఆరోపిస్తున్నారు. కోచి జట్టుకు సంబంధించిన పేవర్ పనులు త్వరగా పూర్తి చేయాలని మాత్రమే తాను మోడీని అడిగిటన్లు థరూర్ చెబుతున్నారు. అయితే, ప్రతిపక్షాలు థరూర్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందుకు సిద్ధపడ్డాయి.












Click it and Unblock the Notifications