జగన్ యాత్ర తెలంగాణపై దాడి: జెఎసి

ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే జగన్ యాత్ర చేపట్టారని ఆరోపించారు. తెలంగాణపై వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వారు జగన్ ను డిమాండ్ చేశారు. జగన్ ఇప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే తెలంగాణలో పర్యటించవద్దని ఆయన అన్నారు. భవిష్యత్తులో జగన్ యాత్రకు తెలంగాణలో అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యాత్రను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటారని, ముందుకు సాగనివ్వరని చెప్పారు. జగన్ యాత్ర ద్వారా ప్రజల మనసు గెల్చుకోవడం అటుంచి వ్యతిరేకత ఏర్పడుతోందని ఏలికలు గుర్తించాలన్నారు.
వైఎస్ జగన్ నిర్వహిస్తున్నది ఓదార్పు యాత్ర కాదని, అది పూర్తిగా రాజకీయ లబ్ధి పొందే దోపిడీ యాత్ర అని ఓయూ జెఎసివిమర్శించింది. నాడు తెలంగాణలో పర్యటించిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ భూములను తెగనమ్మి దోపిడీ చేస్తే నేడు ఆయన కొడుకు వైఎస్ జగన్ పర్యటన తెలంగాణ గనులను, ఖనిజాలను, నీటి వనరులను దోపిడీ చేయడానికేనని జాక్ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications