విశాఖపట్నం: కిడ్నాప్ కు గురైన విద్యార్ధిని శవమై కన్పించింది. విశాఖ జిల్లా పద్దె గంట్యాడ మండలం చినదేవాడలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. సంఘటన స్థలంలో బైక్ లభ్యమైనట్లు సమాచారం. మృతురాలు లత మునగపాక మండలం నాగవరానికి చెందినట్లు గుర్తించారు.
మృతురాలు ఏప్రిల్ 13న అదృశ్యమైనట్లు సమాచారం. ముగ్గురు యువకులు లతను అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.