ఆర్మీ నియామకాల స్కామ్ లో అరెస్టు

కొండల్ రెడ్డి మాజీ సైనికోద్యోగి. కడప జిల్లాకు చెందినవాడు. కొండల్ రెడ్డితో పాటు మరో ముగ్గురు స్థానికేతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నివాస పత్రాలను కొండల్ రెడ్డి సృష్టించి అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు ఆరోపణలున్నాయి. అతని నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ నియామకాల ర్యాలీలో పాల్గొనేందుకు స్థానికులతో పాటు స్థానికేతరులు పెద్ద యెత్తున వచ్చారు. స్థానికులకు, స్థానికేతరులకు మధ్య ఘర్షణ జరగడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డిలకు చెందిన నివాస పత్రాలను సృష్టించి వారు ఉద్యోగాల కోసం వచ్చినట్లు తేలింది.












Click it and Unblock the Notifications