నివేదిక సమర్పణ, సమైక్యాంధ్రకే మజ్లీస్ ఓటు

పెద్దరాష్ట్రాల్లోనే ముస్లింలకు అభివృద్ధిలో భాగస్వామ్యం దక్కడంలేదు. చిన్నరాష్ట్రాల్లో అది మృగ్యమవుతుందని, చిన్నరాష్ట్రాల్లో ముస్లింలకు భద్రత, సామాజిక, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని, ప్రస్తుత డిమాండ్‌లో తెలుగు మాట్లాడే హిందువుల తర్వాత ఉర్దూ మాట్లాడే ముస్లింలే ప్రధాన భాగస్వాములని, వీరికి భౌతికపరమైన భద్రత, ఆర్థికప్రయోజనాలు, సామాజిక, సాంస్కృతిక బంధం, విద్యా విషయాల్లో భయాందోళనలున్నాయని మజ్లీస్ తెలిపింది. రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయ గుర్తింపు లేదని, విభజన జరిగితే పరిస్థితి దిగజారే ప్రమాదముందని తెలిపింది.
బిజెపి, సంఘ్ పరివార్, వామపక్షాలతో నెలకొన్న విరోధం మైనారిటీలకు ఇబ్బందికరంగా మారుతుందని, తెరాస సిద్ధాంతాలపైనా తమకు అనుమానాలున్నాయని, తెలంగాణ డిమాండ్‌కు భావోద్వేగాల కన్నా రాజకీయ మూలాలున్నాయని, దీని ద్వారా స్వప్రయోజనాలను సాధించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయని, ప్రజలకన్నా నాయకులే ఈ డిమాండ్‌ను ఎక్కువగా వినిపిస్తున్నారని అన్నది.












Click it and Unblock the Notifications