'జగన్' నాథ చక్రాల కింద నలిగిపోతారు: సబ్బం

YS Jagan
విశాఖపట్నం: వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ఏమైనా అంటే, అలా అన్న వారు జగన్ నాథ రథ చక్రాల కింద నలిగిపోతారని కాంగ్రెసు అనకాపల్లి లోకసభ సభ్యుడు సబ్బం హరి అన్నారు. జగన్ ను ఎవరైనా పల్లెత్తు మాట అంటే అలా అన్నవారు జగన్ నాథ రథ చక్రాల కింద నలిగిపోతారని ఆయన అన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు ఎంతగా ప్రేమాభిమానాలున్నాయో ఓదార్పు యాత్ర స్పందన తెలియజేస్తోందని ఆయన అన్నారు. ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకోవడం పల్ల ఎంతో పరిపక్వత సాధించారని ఆయన అన్నారు. ప్రజాభిమానంతో జగన్ ఎవరెస్టు శిఖరమంత ఎదిగారని ఆయన కొనియాడారు. ఓదార్పు యాత్రకు వచ్చిన ప్రజలను చూసి ప్రతిపక్షాలు మాట్లాడడం మానేశాయని ఆయన అన్నారు. ఇకపై కూడా మాట్లాడకుండా ఉంటే మంచిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+