ప్రజాపథానికి తెరాస కార్యకర్తల ఆటంకం

సోమవారం ఉదయం మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో తెరాస కార్యకర్తలు ప్రజాపథం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ ను, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని తెరాస కార్యకర్తలు ఘెరావ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోనూ తెరాస కార్యకర్తలు ప్రజాపథం కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రజాపథం కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే తెరాస నిర్ణయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications