హైదరాబాద్: తాను పాల్గొన్న ప్రజాపథం కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాపథాన్ని ప్రారంభించిన ఆయన మంగళవారం పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో సికింద్రాబాదుకు చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా ప్రజాపథం విజయవంతమైందని ఆయన అన్నారు.
పలుచోట్ల ప్రజాపథంలో నిరసనలు వ్యక్తమైనప్పటికీ మొత్తం మీద రాష్ట్రమంతా ప్రజాపథం సక్రమంగా జరిగిందని ఆయన అన్నారు. ప్రజాపథం బాగా జరిగిందని కూడా ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలపడంలో తప్పు లేదని ఆయన అన్నారు.