ట్రిపుల్ ఐటి సీట్లపై రోశయ్యపై జగన్ గుర్రు

క్రమంగా ట్రిపుల్ ఐటి సంస్థలను మూసేసి ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయ, బాసర, నూజివీడులలో ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ ఐటి భవనాలు ఇంజనీరింగ్ కళాశాలలకు సరిపోతాయని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతి పొంది ఈ మూడు ఐఐఐటిలను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చే విషయంపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చలను ప్రారంభించినట్టు తెలిసింది. ఈ మూడు సంస్థలను ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చి బాసరలోని ఐఐఐటిని నిజామాబాద్‌లోని తెలంగాణా విశ్వవిద్యాలయం పరిధిలోకి, ఇడుపులపాయలోని కేంద్రాన్ని యోగివేమన పరిధిలోకి, నూజివీడులోని ఐఐఐటిని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలలను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications