ఎమ్మెల్యేలకు ఇక 4 గురు గన్ మన్లు

జిల్లాలో భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ముదునూరి ప్రసాదరాజు మాత్రమే నలుగురు గన్ మెన్ లను తీసుకునేందుకు అంగీకరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు తమకు ఇద్దరు గన్ మెన్ లు చాలునని, నలుగురు అవసరం లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. గన్ మెన్ లకు సౌకర్యాలు, వారికి వాహనం, తదితర ఏర్పాట్లు సమకూర్చేందుకు భారం అనుకునే ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకున్న భద్రత పెంపు నిర్ణయాన్ని అంగీకరించలేకపోతున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలకు అదనంగా కేటాయించిన గన్‌మెన్‌లు జిల్లా కేంద్రానికి వెనుతిరిగి వచ్చేస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications