నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భర్త భార్యను హత్య చేసిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బాలంపల్లి గ్రామంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి భార్యను హత్య చేసి క్వారీలో పాతిపెట్టాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూడు రోజులుగా కోటేశ్వర రావు కనిపించకపోవడంతో తోటి కార్మికులు కోటేశ్వర రావు కోసం వెతికారు. ఈ సమయంలో కోటేశ్వర రావు భార్య శవం బయటపడింది. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.