సమైక్యవాదం ధైర్యమైన నిర్ణయమే: చిరు

గత ఎన్నికల సమయానికి పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేకపోయామని, ఓట్లు, సీట్లు రాకపోవటానికి ఇదే కారణమని చిరంజీవి అన్నారు. పార్టీపరంగా అనేక లోపాలు జరిగాయని అంగీకరించారు. పోలవరం సాధన ఉద్యమంపై గుంటూరు, ప్రకాశం జిల్లాల కమిటీల సభ్యులతో బుధవారం చిరంజీవి సమావేశమయ్యారు. పండిన పంటను ఇంటికి చేర్చుకోలేకపోవటమే తమ ఓటమికి కారణమని అన్నారు. తమ పార్టీ బాల్యదశ దాటి యవ్వన దశలోకి ప్రవేశిస్తోందని, తాను సైతం ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే యవ్వనంలోనే ఉన్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications