కెసిఆర్ ఫ్యామిలీ తెలంగాణ శిఖండి: తలసాని

Talasani Srinivas Yadav
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుటుంబం మాత్రమే బాగుపడిందని తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఉప ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను పక్కన పెట్టి తెలంగాణ కోసం మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించగలరా అని ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు. రాజీనామాలు చేయించి శాసనసభ్యులను కెసిఆర్ బలి పశువులను చేశారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం మరణించిన విద్యార్థుల కుటుంబాల పరామర్శలకు కూడా వెళ్లని కెసిఅర్ కు తమ పార్టీ నేత చంద్రబాబును విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.

తెలంగాణకు అసలు శిఖండి కెసిఆర్ కుటుంబమేనని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, వాడూ వీడూ అంటే తాము కూడా అదే భాష వాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అన్ని పార్టీలతో కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఏర్పాటుకు కెసిఆర్ పూనుకుని, ఆ జెఎసికి చెప్పకుండా ఒంటెత్తు పోకడతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. రాజకీయ జెఎసి కన్వీనర్ తెరాస ఏజెంటు అని, తెరాస ఆవిర్భావ సభలో కోదండరామ్ పాల్గొనడం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+