విద్యాహక్కును అమలు చేయండి: రోశయ్య

ఇప్పటికే 75 శాతం పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయని సమీక్షానంతరం విద్యాశాఖ మంత్రి మాణిక్యవర ప్రసాద్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. మరో పది రోజుల్లో మిగతా 25 శాతం పాఠ్యపుస్తకాలు కూడా పాఠశాలలకు చేరుతాయని ఆయన చెప్పారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. డిఎస్సీ - 2008 నియామకాలపై వచ్చే నెల 7వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications