జగన్ మాటలు నమ్మకండి: మావోయిస్ట్ సాగర్

కోర్టులోకి వెళుతున్న సాగర్ "మావోయిస్ట్ పార్టీ జిందాబాద్, రాయలసీమ హక్కుల కోసం పోరాడాలి, మావోయిస్ట్ లపై అక్రమ కేసులు ఎత్తివేయాలి' అంటూ నినాదాలు చేశారు. కోర్టులో హాజరైన అనంతరం విలేఖరులతో సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వనరులు, సంపద కేవలం నూటిలో పది మందిగా ఉన్న రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన సంపన్న వర్గాలు అనుభవించడానికి తీసుకున్నదే సమైక్యాంధ్ర నినాదమన్నారు.
అందుకే రాయలసీమ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు రాయలసీమ సార్వభౌమాధికారం కోసం, హక్కుల కోసం పోరాడలన్నారు. సంపన్న వర్గాల ప్రతినిధులుగా ఉన్న టీజీ వెంకటేష్, వైయస్ జగన్ ల వంటి వారి మాటలు నమ్మ వద్దని కోరారు. గ్రీన్ హంట్ సామ్రాజ్య వాదులకు కార్పోరేట్ సంస్థలకు సంబంధించిన అనుకూమైనటువవంటి దుర్మాగ్గమైన యుద్ధమన్నారు. కాగా, ఈ కేసు ఈ నెల 17వ తేదీ వాయిదా వేశారని కోర్టు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications