హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'రక్త చరిత్ర' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి మే 28వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ గురువారం సెన్సార్ బోర్డును ఆదేశించింది. కాగా రక్తచరిత్ర సినిమాను నిలిపివేయాలంటూ సీపీఐ (ఎంఎల్) కార్యకర్త హెచ్ ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రక్తచరిత్ర పరిటాల రవి జీవిత గాధ ఆధారంగా రూపొందిన సినిమా. ఈ సినిమా కథ కోసం వర్మ అనంతపురంలో పర్యటించి వివరాలు సేకరించారు.