తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవ టిక్కెట్ల అవకతవకలపై మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని టీటీడీ ఈవో కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ అక్రమాలపై విచారణ ప్రాథమిక దశలో ఉందన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఈవో పేర్కొన్నారు.
ఒకే వ్యక్తికి అనేక దఫాలుగా టిక్కెటు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వచ్చే శుక్రవారం నుంచి ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేయనున్నట్లు ఆయన తెలిపారు.