కెసిఆర్ కు పోటీగా సిద్ధిపేటలో సభ: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: మెదక్ జిల్లా సిద్ధిపేటలో తాను ఈ నెల 29వ తేదీన సభ పెడతానని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కోట సిద్ధిపేటలో తాను సమైక్యవాణి వినిపిస్తానని ఆయన అంటున్నారు. కెసిఆర్ ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరిగే జై ఆంధ్ర మహాసభకు హాజరవుతానని చెప్పగానే లగడపాటి రాజగోపాల్ ఆ సవాల్ చేశారు.

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఉండాలని చెప్పడం వల్లనే తాను ఏమీ మాట్లాడడం లేదని లగడపాటి రాజగోపాల్ అన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి లగడపాటి రాజగోపాల్ కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తన నియోజకవర్గం విజయవాడనే కెసిఆర్ ఆంధ్ర పర్యటనకు ఎంచుకోవడం లగడపాటికి ఆగ్రహం తెప్పిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+