మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన లైలా తుపాను వాయుగుండగా మారనుందని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) తెలిపింది. ప్రస్తుతం ఒంగోలుకి ఆగ్నేయ దిశగా వంద కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని ఈరోజు మధ్యాహ్నాం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి బలహీన పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లైలా తుపాను మధ్యాహ్నానికి విశాఖ, విజయనగరాల మీదుగా ఒరిస్సాలోని బాలాసోర్ నుంచి బంగ్లాదేశ్, బర్మా వైపు వెళ్లనుంది.












Click it and Unblock the Notifications