పెళ్ళి బృందం బస్సు బోల్తా

భారీ వర్షాలకు రోడ్డు అంచున వేసిన మట్టి కూరుకుపోవడంతో బస్సు ఒక పక్కకు ఒరిగిపోయి సమీపంలోని పొలాల్లోకి పల్టీకొట్టింది. ఈ బస్సులో సుమారు 60 మంది ఉన్నారు. డోర్లు ఉన్న వైపు బస్సు బోల్తాపడడంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి నానా అవస్థలు పడ్డారు. ప్రాణభయంతో పెద్ద పెట్టున కేకలు పెట్టారు. గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న వారిని రక్షించారు.
ఒకరిపై ఒకరు పడిపోవడవంతోపాటు అద్దాలు పగిలి, రేకులు గీసుకొని మొత్తం 30మందికి గాయాలయ్యాయి. బంటు పద్మ, బొడ్డేపల్లి రమణమ్మ, అమరిపల్లి లకి, నారపల్లి రమణమ్మ, బంటు సత్యవతి, ఇందలి రమణమ్మ, బలిరెడ్డి పైడమ్మ, గేదెల లకి, లక్క వరహాలమ్మ, గేదెల రత్నంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆటోల్లోను, కారుల్లోను విశాఖపట్నం తరలించారు.












Click it and Unblock the Notifications