కాంగ్రెసుది ఆత్మవంచన యాత్ర: కెటిఆర్

KT Rama Rao
కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తలపెట్టిన ఆత్మవిశ్వాస యాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కెటి రామారావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మవిశ్వాస యాత్ర పేరుతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణలో ఆత్మవంచన యాత్ర చేయబోతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

జై ఆంధ్ర మహాసభకు తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వెళ్లకూడదని తెలంగాణ జెఎసి అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చునని, పర్యటనలు చేయవచ్చునని ఆయన అన్నారు. కాగా, కెసిఆర్ విజయవాడ యాత్రపై తమను ఎవరూ సంప్రదించలేదని జెఎసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కెసిఆర్ విజయవాడ వెళ్లడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+