హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పుష్పలీల గాయపడ్డారు. హైదరాబాదులోని ఖైరతాబాదులో ఆమె ప్రయాణిస్తున్న కారును శుక్రవారం ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో పుష్పలీల తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.
ఆర్టీసి బస్సు పుష్పలీల కారును ఢీకొట్టడంతో కారు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. అయితే దాని వల్ల పెద్ద ప్రమాదం సంభవించలేదు. ఇతర వాహనదారులకు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు.