విశాఖ జిల్లాలో ప్రియురాలిపై హత్యాయత్నం

లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ పై కుమారి అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంజీవ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమిస్తున్నానంటూ సంజీవ్ కుమార్ 2008 నుంచి తన వెంట పడుతున్నాడు. అతని ఒత్తిడి మేరకు తాను ఒప్పుకున్నానని, 2009లో బలవంతంగా తనతో శారీరక వాంఛ తీసుకోవడం మొదలు పెట్టాడని కుమారి అంటోంది. చివరకు గర్భం రావడంతో తనను హత్య చేయడానికి పూనుకున్నాడని ఆమె చెబుతోంది. సంజీవ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications