మృతుల్లో ఎక్కువ మంది మలయాళీలు

మంగుళూరులో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉండగా 9మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ముందు మంటలను అదుపుచేశారు. ఆ తర్వాత 90 మృతదేహాలను బయటకు తీశారు.
మంగుళూరులో జరిగిన విమానప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియానుఅందజేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications