హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలోనే రాష్ట్రంలో అడుగుపెట్టనున్నాయి. ఏటా వచ్చే సమయానికి 4-5 రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని, ప్రతిరోధకాలు లేకపోతే జూన్ తొలి వారంలోపు రాష్ట్రంలో అడుగుపెట్టవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
దీనితో ఖరీఫ్ సీజన్ హడావుడి త్వరగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీనే రాష్ట్రంలోకి రుతుపవనాలు రావచ్చని మరో అంచనా. రుతు పవనాలు సకాలంలో వస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతుంది.