తిరుమల: శ్రీవారి సన్నిధిలో ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. అంజనాద్రి నగర్ ఏఎంసీ కాటేజీలో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మల్లీశ్వర్ రెడ్డి మృతిచెంది పడివున్నాడు. కాటేజీలో ఇతనితో పాటు ఉన్న ముగ్గురు స్నేహితులు పరారీలో ఉండడం, మృతుడు బలవనర్మరణానికి గురైనట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
మృతుని గ్రామానికే చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి పేరుతో కాటేజీ బుక్ చేశారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో ఆత్మహత్యలు మామూలే అయినా హత్యా సంఘటనలు జరగడం చాలా అరుదు.