సమ్మెతో 76 విమానాలు రద్దు

జూన్ నెల వేతనాలు నేటి వరకూ సిబ్బందికి ఇవ్వకపోగా, జూలై నెల జీతాలు కూడా సంస్థకు వదిలేయాలని ఎయిర్‌ఇండియా యాజమాన్యం ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏవియేషన్ ఇండిస్టీ ఎంప్లాయిస్ గిల్డ్ (ఎఐఇజి) సెక్రటరీ విజె. దెకా తెలిపారు. దీంతో 10 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. సంస్థల్లో పని చేస్తోన్న సుమారు 25 వేల మంది సిబ్బందికి జూన్ నెల జీతాలు చెల్లించడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించాయి. వేతనాల సంగతి తేల్చకుంటే 'నో పే..నో వర్క్" పాలసీ కింద విధులను దేశ వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
తక్షణం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని ఎయిర్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాలు పేర్కొన్నాయి. దీంతో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా సీఎండి అరవింద్ జాదవ్‌తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications