వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ఇప్పటికే చెప్పాం: సింఘ్వీ
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రపై పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రపై కొత్తగా చెప్పేదేమీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇది వరకు చెప్పిన విషయం తెలిసిందే.
ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి సాధించేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో సింఘ్వీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ కు సింఘ్వీ ప్రకటన శరాఘాతం లాంటిదే.