సీమాంధ్ర నేతల కట్టడికి సిఎంతో డిఎస్ మంతనాలు

ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై, తాజా రాజకీయ పరిణామాలపై, తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, విద్యార్థుల ఫీజుల చెల్లింపు అంశంపై కూడా వారు చర్చించారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఫీజుల చెల్లింపులకు ఆటంకం రానివ్వొద్దని సీఎంకు డీఎస్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను బట్టి విడతలవారీగా చెల్లింపులన్నీ పూర్తిచేస్తామని డీఎస్‌కు రోశయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం. జూలై 8న వైఎస్ జయంతి కార్యక్రమంపై కూడా చర్చించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications