ఢిల్లీ ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మహిళా టెక్కీ మృతి

తాము చేస్తున్న మొబైల్ కాల్స్ కు సమాధానం రాకపోవడంతో మోనికా తల్లిదండ్రులు ఢిల్లీకి వచ్చారు. ఇల్లు లాక్ చేసి ఉండడంతో తలుపులు పగులగొట్టారని, మోనికా శవం బెడ్డుపై పడి ఉందని, శరీరంపై పలు గాయాలున్నాయని, శవపరీక్షకు ఆదేశించామని అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్కే జైన్ చెప్పారు. పోస్టుమార్టం తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని ఆయన అన్నారు.
మోనికా గుర్గావ్ లోని ఐబియంలో పనిచేస్తోంది. గత ఏడాదిన్నరగా ఆమె మదన్గిరీలో నివాసం ఉంటోంది. రవి మిశ్రాను, ఇతర మిత్రులను పోలీసులు విచారించారు. ఈ నెల 14వ తేదీన ఆమె మిశ్రాను పెళ్లి చేసుకోవాల్సి ఉండింది.












Click it and Unblock the Notifications