గెలిచి వచ్చి అసెంబ్లీలో అగ్గి రాజేస్తాం: కె. చంద్రశేఖర రావు

ఉప ఎన్నికల తర్వాత జెఎసి నాయకులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని ఆయన చెప్పారు. జెఎసి జెండాను ప్రతి గ్రామంలో ఎగురేస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కకుండా పనిచేయాలని విద్యార్థులు కోరకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా చేసిన నాయకులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల ఆకాంక్ష కేంద్రానికి, శ్రీకృష్ణ కమిటీకి తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications