నిత్యానంద విడుదల, ఆశ్రమంలో పంచ తపస్య యాగం

Nityananda Swami
బెంగళూరు: ఎట్టకేలకు నిత్యానంద స్వామి జైలు నుంచి విడుదలై ఆశ్రమానికి చేరుకున్నారు. సినీనటి రంజితతో రాసలీలల కేసులో అరెస్టయిన ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద పరమహంస (34) రామనగర సబ్‌జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. ఎవరితో మాట్లాకుండా, చిరునవ్వులు చిందిస్తూ జైలు నుంచి నేరుగా బిడదిలోని ధ్యానపీఠం ఆశ్రమానికి ఏడు గంటలకు చేరుకున్నారు. నిత్యానందకు హారతులు, పూలమాలలు, భజనలతో భక్తులు స్వాగతించారు. ఏడుసార్లు యత్నించిన తరువాత తరువాత నిత్యానందకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను శుక్రవారం సాయంత్రం మంజూరు చేసింది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కారణంగా సోమవారం మధ్యాహ్నం స్వామి విడుదల అవుతారని ఆయన న్యాయవాదులు తొలుత ప్రకటించారు.

తరువాత నిర్ణయం మార్చుకుని నిత్యానంద న్యాయవాదులు ప్రవీణ్‌, వివేకానంద గుప్తలు నేరుగా శనివారం మధ్యాహ్నం రామనగర జైలు వద్దకు వెళ్లి బెయిలు ప్రతిని అధికారులకు చూపించారు. నిత్యానందకు 23వ తేదీ వరకు రిమాండ్‌ ఉందని అధికారులు చెప్పటంతో మెజిస్ట్రేట్‌ ఇంటికి వెళ్లి బెయిల్‌ ప్రతిని, ఇద్దరి పూచీకత్తు పత్రాలను అందించారు. అక్కడ నిత్యానంద విడుదలకు అనుమతి పత్రం తీసుకుని ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. ఆదివారం (నేడు) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యానంద పంచతపస్య యాగాన్ని చేయనున్నారు. తన చుట్టూ దడిలాగా మండే నిప్పుల కంచెను ఏర్పాటు చేసుకుని దాని మధ్యలో ఆయన కూర్చొని ఈ యాగాన్ని చేయనున్నట్లు సమాచారం. కంచె నుంచి మంటలు మూడడుగుల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+