వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి మనవడు జయంత్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. జయంత్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు ఎరుగని కామ్రేడ్ ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండరు. ఆయన కష్టజీవుల పాలిట కరుణామూర్తి, నల్గొండజిల్లా లోని వెనుకబడిన ప్రాంతం నుంచి లోక్ సభ వరకు ఆయన సుపరిచితులు. అంత గొప్ప మనిషి కుటుంబానికి ఇంత కష్టం కలగడం నిజంగా అందరికీ బాధాకరం.