టెక్సాస్: అమెరికాలో ఎమ్మెస్సీ చదువుతున్న తెలుగు యువకుడొకరు హత్యకు గురయ్యాడు. టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతున్న ఆదర్శ్ జాన్ అనే తెలుగు యువకున్ని దుండగులు హత్య చేసినట్టు సమాచారం అందింది. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆదర్శ్ టెక్సాస్ వర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు అతడి స్వస్థలం.