ముంబై: హిందూమహా సముద్రంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇండియా, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ దేశాలకు జాగ్రత్తలను సూచించారు. సముద్ర గర్భంలో 11 కి.మీ లోతులో భూమి కంపించడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ కోస్తాంధ్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భూమి ప్రకపించింది. గత నెల కూడా సునామీ హెచ్చరికల అనంతరం కోస్తా తీరంలో సముద్రపు అలలు ఉవ్వెతున ఎగిసిపడ్డాయి.