‘సర్‌’లో 60లక్షల ఓట్లకు కోత..? ఎవరికి నష్టం..!?

తెలంగాణ సర్ పక్రియ తుది దశకు చేరుకుంది. మరో అయిదు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో... అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ కోసం క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలుస్తున్నారు. అయితే, సర్ ప్రక్రియ తరువాత ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిన విధంగానే ఇక్కడ పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. అధికారులు ఈ నెల 10న పూర్తి ప్రక్రియ ముగిసిన తరువాత ముసాయిదా ప్రకటించనున్నారు.

సర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. సర్ ప్రక్రియ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. కాగా, రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ అనంతరం సుమారు 60 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో దాదాపు 44 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గింది. అయితే, తెలిగించే ప్రతీ ఓటరకు నోటీసు ఇచ్చి.. సమాధానం వచ్చిన తరువాతనే నిర్ణయం ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్ నమోదులో భాగంగా ఇళ్లు మారిన ఓటర్ల వివరాల సేకరణలో ఇబ్బంది, చనిపోయినవారు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు.

 హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్..!!
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్..!!
voters-over-60-lakh-estimate-that-the-number-of-voters-in-telangana-could-decrease-as-part-of-sir-pr

ఈ నెల 10వ తేదీతో ముగియనున్న గడువు

అయితే.. పదో తేదీ గడువు ముగియనుంది. మరో అయిదు రోజులే సమయం ఉండటంతో అటు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్లను గుర్తించి, వివరాలు నమోదు చేయడంపై బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), వివిధ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా నిర్ణీత చిరునామాల్లో లేనివారు ఎక్కడికి మారారు? వలస వెళ్లారా, స్థానికంగా మరోచోటికి మారారా అనేది ఆరా తీసి, వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 77.66 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, చిరునామా నిర్ధారణలో ఇబ్బంది వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు. మొత్తంగా 'సర్‌' ప్రక్రియ పూర్తయ్యే సరికి రాష్ట్రంలో 60లక్షలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని సంబంధిత విభాగాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 40లక్షల మంది ఓటర్ల జాబితాల్లోని చిరునామాల్లో అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. వీరి విషయంలో సర్ ప్రక్రియ పూర్తయిన అయిన తరువాత స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+