అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

ఈసారి పుట్టిన రోజు(ఆగస్టు 2) ఘనంగా జరుపుకుందాం రండంటూ, తమకు వీసాలు ఏర్పాటు చేసిన కొడుకు ఇలా హత్యకు గురవడం ఆదర్శ్ తల్లిదండ్రులకు జీర్ణించుకోలేనిదిగా మారింది. తాండూరులోని మల్‌రెడ్డిపల్లి ప్రాంతంలో నివసించే జసంత్, డాన్ బాస్కో ఫ్యాట్రిక్‌ల మొదటి సంతానమైన ఆదర్శ్ చిన్నప్పటి నుంచీ చురుకైన విద్యార్థి. వరంగల్ జిల్లా జనగాంలో బీటెక్ విద్యనభ్యసించాడు. ఎంఎస్ చేయడం కోసం అమెరికాకు వెళ్లాడు. టెక్సాస్‌లో తాను చదువుతున్న మేరీ హార్డిన్ బేలర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగమూ సంపాదించాడు.
ఈ ఏడాది మే నెలలో ఉత్తమ విద్యార్థి అవార్డును పొందడమే కాకుండా కళాశాలలో స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. ఇలా ఆదర్శ్ ఎదగడం చూసి ఓర్వలేని వారే ఆయన్ను చంపేసి ఉంటారన్నది కుటుంబ సభ్యుల అనుమానం. ఆదర్శ్ శవాన్ని త్వరితంగా భారత్‌కు రప్పించేందుకు అన్ని చర్యలూ చేపడతామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. ఆదర్శ్ తల్లిదండ్రులను ఆయన ఆదివారమిక్కడ పరామర్శించారు.












Click it and Unblock the Notifications