లక్నో: గంగానదిలో సోమవారం ఉదయం పడవ మునిగింది. ఈ ప్రమాదంలో 50 మంది దాకా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. ఉత్తరప్రదేశ్ లోని బలియా వద్ద అగరేల గ్రామం వద్ద ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే.
ప్రమాదం సంభవించినప్పుడు పడవలో 80 మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. బరువు ఎక్కువ కావడంతో పడవ మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.