పొన్నాల లక్ష్మయ్య మెడకు పోలవరం ప్రాజెక్టు ఉచ్చు

తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. సొంత పార్టీ వారే ఈ విధమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని పొన్నాల రోశయ్యతో అన్నట్లు సమాచారం. ఆరోపణలు చేస్తున్న నేతలను కట్టడి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. కాగా, రాష్ట్ర మంత్రులు జె. గీతారెడ్డి, డికె అరుణ, శ్రీధర్ బాబు పొన్నాలకు అండగా నిలిచారు. పొన్నాలపై కాంగ్రెసు సీనియర్లు ఆరోపణలు చేయడాన్ని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ఏదైనా ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలని, పార్టీ అధిష్టానం దృష్టికి గానీ ముఖ్యమంత్రి దృష్టికి గానీ తేవాలని, ఈ విధమైన బహిరంగ విమర్శలు సరి కాదని వారన్నారు. పోలవరంపై రభస సరి కాదని మరో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుందని వస్తున్న ఆరోపణలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. డిజైన్ మార్చాలనే డిమాండ్ ను కూడా ఆయన వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications