తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ వైద్య కళాశాలలో అనుదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన అనుదీప్ వైద్య విద్య మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కళాశాల యాజమన్యాన్ని విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.