హైదరాబాద్: కేరళ రాష్ట్రంతో పోలిస్తే విద్యలో మనం ఇంకా వెనకడబడే ఉన్నామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్న సందర్భంగా ఆయన సోమవారం బడిబాట కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మనం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఇంకా వెనకబడే ఉన్నామని ఆయన అన్నారు. వీధి బాలలను పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన అధికారులను సూచించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన 50 మంది బాలలకు ఆయన అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గుల్జార్ నటరాజన్, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మస్తానయ్య, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.